అమెరికాతో దౌత్యానికి ఇప్పుడైతే అవకాశం లేదని ఇరాన్‌ తేల్చేసింది.
డిల్లీ ,22 జూన్ (హి.స.) తమ దేశంలోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడాన్ని ఇరాన్‌ తీవ్రంగా పరిగణించింది. తాజాగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి స్పందించారు. తమ దేశంపై అమెరికా దాడి చేశాక చర్చలు అనేది సరైన ఎంపిక కాదని ఆయన విలేకర్లకు వెల్లడ
అమెరికాతో దౌత్యానికి ఇప్పుడైతే అవకాశం లేదని ఇరాన్‌ తేల్చేసింది.

డిల్లీ ,22 జూన్ (హి.స.)

తమ దేశంలోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడాన్ని ఇరాన్‌ తీవ్రంగా పరిగణించింది. తాజాగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి స్పందించారు. తమ దేశంపై అమెరికా దాడి చేశాక చర్చలు అనేది సరైన ఎంపిక కాదని ఆయన విలేకర్లకు వెల్లడించారు. ‘‘దౌత్యం అనే దానికి ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి. ఇప్పటికైతే మాత్రం దానికి అవకాశం లేదు. అమెరికా మాత్రం అణు కేంద్రాలపై దాడి చేసి చాలా పెద్ద రెడ్‌లైన్‌ను దాటింది. మా ఆత్మరక్షణ హక్కు ఆధారంగా స్పందించాల్సి ఉంది ’’అని పేర్కొన్నారు. అమెరికా దాడుల తర్వాత దౌత్యానికి ఎంత వరకు అవకాశం మిగిలిందో తెలియదని పేర్కొన్నారు.

తమ దేశంలో అణు కేంద్రాలపై దాడికి యుద్ధోన్మాదంలో ఉన్న శ్వేత సౌధం.. తర్వాత పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని అబ్బాస్‌ హెచ్చరించారు. శాంతియుత అణు కార్యక్రమంపై అమెరికా సైనిక దుశ్చర్యను ఇరాన్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఐరాస చట్టాలను అగ్ర రాజ్యం తుంగలో తొక్కిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు

 rajesh pande