అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్‌
టెహ్రాన్ , 22 జూన్ (హి.స.)అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్‌ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ
అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్‌


టెహ్రాన్ , 22 జూన్ (హి.స.)అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్‌ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా సైన్యం తాజాగా ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ అణుశక్తి సంస్థపై శత్రువుల కుట్రలు సాగుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రయత్నాలతో ఏర్పడిన ఈ జాతీయ పరిశ్రమ అభివృద్ధిని ఆపబోమని ఇరాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ జియోనిస్ట్ పాలనలోని దురాక్రమణకు తమ ప్రతిస్పందన మరింత వినాశకరంగా ఉంటుందని హెచ్చరించారని అధికారిక ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది. ఈ దాడుల కారణంగా టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్ నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని పర్వతాలలోగల అణు కేంద్రంపై అమెరికా దాడి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande