స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
ముంబై, 24 జూన్ (హి.స.) నేడు బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, US డాలర్ అస్థిరత వంటి ఇటీవలి ప్రపంచ మరియు భౌగోళిక రాజకీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం ద
Gold


ముంబై, 24 జూన్ (హి.స.)

నేడు బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, US డాలర్ అస్థిరత వంటి ఇటీవలి ప్రపంచ మరియు భౌగోళిక రాజకీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్‌లో కనిపిస్తోంది. జూన్ 24న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 290 రూపాయల వద్ద ఉంది.

కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇప్పటివరకు బంగారం ధర పెద్దగా పెరగలేదు. ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడి చేసినప్పటికీ, సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.27% తగ్గింది.

భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం మధ్యాహ్నం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి . ప్రారంభ వాణిజ్యంలో ఇది కేవలం 0.06% స్వల్ప క్షీణతతో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రూపాయి బలహీనత భారతదేశంలో బంగారం ధరలకు మద్దతు ఇస్తోంది. ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపి ధరలు మరింత పెరుగుతాయని గుర్తించుకోండి.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 830 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,440 రూపాయలు ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 680 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,290 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,290 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధర విషయానికొస్తే ఇది కూడా స్వల్పంగానే తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 990 రూపాయల వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande