మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం' మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ, 25 జూన్ (హి.స.) శశి థరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ''మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం'' అంటూ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ .. ''
మల్లికార్జున ఖర్గే


న్యూఢిల్లీ, 25 జూన్ (హి.స.) శశి థరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. 'మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం' అంటూ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ .. 'శశి థరూర్ ఆంగ్ల భాషలో నిష్ణాతులు. ఆయన భాష చాలా బాగుంది. అందుకే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిని చేశాం. ఆయన వ్యాఖ్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. దేశ క్షేమం, రాజ్యాంగ పరిరక్షణపైనే మా దృష్టి. మేము దేశం కోసం కలిసి నిలబడతాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా దేశం కోసమే నిలబడ్డాం. మాకు దేశమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే పార్టీ. కానీ కొంతమందికి మాత్రం ప్రధాని మోదీయే తొలి ప్రాధాన్యం' అంటూ వ్యాఖ్యానించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande