బెంగళూరు, 28 జూన్ (హి.స.) ఆరోగ్యానికి గుడ్డు చేసే మేలు అంతాఇంతాకాదు. అన్ని వయసుల వారికి గడ్డు మంచి పోషకాహారం. అయితే గుడ్డు ఉడికించిన తర్వాత చాలా మంది వీటి తొక్కలను పడేస్తుంటారు. వీటిని వృద్ధాగా పడేసే బదులు.. అందానికి మెరుగులు దిద్దవచ్చు. గుడ్డు పెంకులతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మంపై ముడతలను తొలగించడానికి మ్యాజిక్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచడానికి, చర్మ కాంతిని పునరుద్ధరించడానికి గుడ్డు తొక్కల ఫేస్ ప్యాక్ బలేగా ఉపయోగపడుతుంది.
ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే?
ముందుగా గుడ్డు పెంకులను తీసుకుని, వాటిని నీటిలో కాసేపు నానబెట్టాలి. అనంతరం వీటిని మిక్సర్ గ్రైండర్లో వేసి పొడిగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో గుడ్డు పచ్చసొన కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. అందులో కొంచెం శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా తేనె, పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కలిపితే ఫేస్ ప్యాక్ తయారైనట్లే. ఈ ఫేస్ ప్యాక్‌ను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా చర్మానికి అప్లై చేయవచ్చు.
ఎలా అప్లై చేయాలి?
ముందుగా, ముఖాన్ని ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసి, అరగంట పాటు అలాగే ఉంచాలి. అది ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అనంతరం ముఖాన్ని తుడిచి కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి కనీసం 2 రోజులు వాడాలి. ఫలితంగా చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా మారుతుంది
గుడ్డు పెంకులు స్క్రబ్ లా కూడా బాగా పనిచేస్తుంది. ముందుగా గుడ్డు పెంకులు మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనె కలిపి స్క్రబ్‌లా వాడుకోవాలి. ఈ గుడ్డు పెంకుల స్క్రబ్ చర్మంపై ముడతలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. గుడ్డు పెంకులు చర్మానికే కాకుండా జుట్టుకు కూడా మేలు చేస్తుంది. షాంపూతో కొద్దిగా గుడ్డు పెంకుల పొడిని కలిపి, తలస్నానం చేయాలి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి