అండర్ 19 యూత్ వన్డే ..సూర్యవంశీ మెరుపులు.. ఇంగ్లండ్ ఓట‌మి!
న్యూఢిల్లీ, 28 జూన్ (హి.స.) అండర్ 19 యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. హోవ్‌లో నిన్న‌ జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుపై 6 వికెట్ల తేడాతో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్
క్రికెట్


న్యూఢిల్లీ, 28 జూన్ (హి.స.)

అండర్ 19 యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. హోవ్‌లో నిన్న‌ జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుపై 6 వికెట్ల తేడాతో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు బాది టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని రెండో వన్డే జూన్ 30న, మూడో వన్డే జూలై 2న నార్తాంప్టన్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత జూలై 5, 7 తేదీల్లో వోర్సెస్టర్‌లో మరో రెండు వన్డేలు, అనంతరం రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande