దిల్లీ, 28 జూన్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి (USA) వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నవేళ ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్ అవుతోంది. అదే ఓ-1 వీసా (O-1 visa). అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను ఈ మధ్య తెగ ఆకర్షిస్తోన్న వీసా ఇది. ముఖ్యంగా హెచ్-1బీకి ప్రత్యామ్నాయంగా మారిన ‘ఓ-1’ వీసా కోసం భారతీయులు ప్రయత్నిస్తున్నారు.
ఇంతకీ
యూఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 కింద ఈ ఓ-1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ (O-1A), ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ (O-1B) అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించినవారికి ఈ వీసాలను మంజూరుచేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు.. నిర్ణయించిన ఎనిమిది కఠిన ప్రమాణాల్లో కనీసం మూడైనా కలిగిఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం లేదా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగిఉండటం, మీడియా కవరేజీ వంటివి ప్రమాణాలుగా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు