ఇండియాలో కార్లు తయారుచేయడం టెస్లాకు ఇష్టం లేదు: కేంద్రం
ఢీల్లీ, 3 జూన్ (హి.స.)ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రస్తుతానికి భారతదేశంలో వాహనాల తయారీని ప్రారంభించే అవకాశం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిు తెలిపారు. ఆ సంస్థ దేశంలో తమ షోరూమ్‌లను ఏర్పాటు చేయడంపైనే
ఇండియాలో కార్లు తయారుచేయడం టెస్లాకు ఇష్టం లేదు: కేంద్రం


ఢీల్లీ, 3 జూన్ (హి.స.)ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రస్తుతానికి భారతదేశంలో వాహనాల తయారీని ప్రారంభించే అవకాశం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిు తెలిపారు.

ఆ సంస్థ దేశంలో తమ షోరూమ్‌లను ఏర్పాటు చేయడంపైనే దృష్టి సారించిందని పేర్కొన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల నూతన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వారు (టెస్లా) భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వారు షోరూమ్‌లు మాత్రమే ప్రారంభిస్తారు అని కుమారస్వామి చెప్పినట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande