మాదాపూర్ .సున్నం చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేతల ప్రారంభం
అమరావతి, 30 జూన్ (హి.స.)మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు ఎఫ్ టి ఎల్
మాదాపూర్ .సున్నం చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేతల ప్రారంభం


అమరావతి, 30 జూన్ (హి.స.)మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించేస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా రూ. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు వెలుగుచూశాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగిస్తున్నారు. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం కొనసాగుతోంది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా సూచించిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande