ఓఆర్ఆర్పై ఒకదానికొకటి ఢీకొన్న 9 కార్లు.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనకవస్తున్న కార్లు ఒకదానికొకటి వరుసగా ఢ
Orr


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనకవస్తున్న కార్లు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఇలా మొత్తం తొమ్మిది కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అవన్నీ రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కార్లను తొలగించారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడటంతో వారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande