బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు..
హైదరాబాద్, 30 జూన్ (హి.స.) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నిక
బీజేపీ


హైదరాబాద్, 30 జూన్ (హి.స.)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ వేయాలని పార్టీ హైకమాండ్ ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరిగింది. అయితే రమచందర్రావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది.

రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే.. మంగళవారం మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాలులో ఎన్నికలు నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande