టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఈ నెల 18 నుండి టెట్ పరీక్షలు..
హైదరాబాద్, 4 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు షిఫ్ట్ జరగనున్నాయి. పరీక్షలు
టెట్ పరీక్షలు


హైదరాబాద్, 4 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు షిఫ్ట్ జరగనున్నాయి. పరీక్షలు రెండు పేపర్లుగా - పేపర్-1, పేపర్-2 విభజించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం జిల్లాల వారీగా పరీక్షల తేదీలు, సబ్జెక్టులు కేటాయించబడ్డాయి.

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో షిఫ్ట్ జరుగుతాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande