తెలంగాణ, వరంగల్. 4 జూన్ (హి.స.) వరంగల్ నగరంలోని ప్రసిద్ధ కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బుధవారం ఉదయం హాస్పిటల్ చేరుకున్న కలెక్టర్ రేడియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రోలజీ, ఫార్మసీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, విభాగాలతో పాటుగా ఆపరేషన్ థియేటర్స్, డయాలసిస్ విభాగాలను తనిఖీ చేశారు.
విధులకు హాజరుకాని వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కేఎంసీ ప్రిన్సిపల్ డా.రాంకుమార్ రెడ్డిని ఆదేశించారు. ఆపరేషన్లు నిలిచిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచిన ఏసీల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు