కర్నూలు, 4 జూన్ (హి.స.)తమలపాకు.. ఇది ఆకుపచ్చ రంగులో ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇలాంటి తమలపాకుని పూజాది శుభకార్యాలు మొదలుకుని చాలా రకాలుగా వాడతారు. ఆయుర్వేదంలో కూడా తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని చెబుతున్నారు. తాజా తమలపాకులో కాల్షియం, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, కెరోటిన్, నియాసిన్, క్లోరోఫిల్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. తమలపాకుని సరిగ్గా తింటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకు తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయాన్నే ఖాళీ కడుపున తమలపాకు తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. తేపులు, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జలుబుకి కూడా తమలపాకు మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తమలపాకు కషాయం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి