యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస
అమరావతి, 4 జూన్ (హి.స.)రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ (Nara Lokesh)... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyna) కు అందజేశారు. క్యాబినెట్ సమా వే శం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్ర
యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస


అమరావతి, 4 జూన్ (హి.స.)రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ (Nara Lokesh)... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyna) కు అందజేశారు.

క్యాబినెట్ సమా వే శం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాద యా త్ర సఫలీకృత మైందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చి పోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్... పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande