హైదరాబాద్, 5 జూన్ (హి.స.)
అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. గురువారం ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్‌కావేటర్లతో చిన్నరాయుని చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే మూడు భవన నిర్మాణాలను కూల్చివేశారు.ఈ క్రమంలో నిర్మాణదారులకు, హ్రైడా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడ మోహరించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..