మొక్కలు నాటిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, 5 జూన్ (హి.స.)పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ‌ ఉదయం నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మొక్కలు నా
చెన్నూరు ఎమ్మెల్యే


మంచిర్యాల, 5 జూన్ (హి.స.)పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ‌ ఉదయం నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించినట్లయితే భావితరాలకు శ్రేష్ఠమైన వాయువును అందించిన వారమవుతామన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి మాస్క్, క్యాప్ లు, తదితర సామాగ్రిని అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande