ఢిల్లీ, 7 జూన్ (హి.స.)ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్‌కు ఎదురులేకుండా పోయింది.
వరుసగా రెండోసారి పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడానికి అడుగుదూరంలో నిలిచాడు. సెమీస్‌లో వాకోవర్ పొంది ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టితో అల్కరాజ్ తలపడ్డాడు. అయితే, నాలుగో సెట్‌లో ముసెట్టి గాయం కారణంగా ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. ఆట ఆగిపోయే సమయానికి మ్యాచ్ 4-6, 7-6(7-3), 6-0, 2-0 తో అల్కరాజే ఆధిపత్య స్థితిలో ఉన్నాడు.
అంతకుముందు అల్కరాజ్, ముసెట్టి మధ్య ఆసక్తికర పోరు సాగింది. మ్యాచ్‌లో మొదట ముసెట్టిదే ఆరంభం. అల్కరాజ్‌ను నిలువరించి తొలి సెట్ గెలిచాడు. ఆ తర్వాత కూడా పోటీనిచ్చినా అల్కరాజ్ బలంగా పుంజుకోవడంతో అతన్ని నిలువరించడం ముసెట్టితో కాలేదు. రెండో సెట్‌ను ట్రై బ్రేకర్‌లో నెగ్గిన అల్కరాజ్.. మూడో సెట్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుని 2-1తో మ్యాచ్‌లో ఆధిక్యతలోకి వెళ్లాడు. ఇక, నాలుగో సెట్‌లో రెండు గేములు నెగ్గి లీడ్‌లో కొనసాగాడు. అదే సమయంలో ముసెట్టి గాయం కారణంగా తప్పుకోవడంతో అల్కరాజ్ వాకోవర్ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇది అతనికి ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఐదు గ్రాండ్‌స్లామ్ ఫైనల‌్‌కు చేరిన ఐదో యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే, ప్రస్తుతం ఆడుతున్న వారిలో మైలురాయి సాధించిన మూడో ప్లేయర్ అల్కరాజ్. అతనికంటే ముందు జకో(37), మెద్వెదెవ్(6) ఉన్నారు. గతేడాది అల్కరాజ్ తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో అతను.. జకోవిచ్ లేదా సిన్నర్‌తో తలపడనున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి