ఓర్నీ ఇదేంది.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..?
ముంబై, 1 జూలై (హి.స.)బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. అమాంతం మళ్లీ పెరిగాయి.. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్ర
GOLD


ముంబై, 1 జూలై (హి.స.)బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. అమాంతం మళ్లీ పెరిగాయి.. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దాదాపు రూ.5వేల వరకు దిగివచ్చాయి.. అయితే.. ఈ క్రమంలోనే బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పది గ్రాముల బంగారం పై ఏకంగా రూ.1,140 మేర ధర పెరిగింది.. జులై 1 2025 మంగళవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 98,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,200 లుగా ఉంది. గోల్డ్ 24 క్యారెట్ల పై రూ.1140, 22 క్యారెట్లపై రూ.1,050 మేర ధర పెరిగింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి కిలోపై రూ.2,300 మేర ధర పెరిగి.. రూ.1,10,00లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande