ఆక‌ట్టుకుంటున్న 'త‌మ్ముడు' రిలీజ్ ట్రైల‌ర్‌
అమరావతి, 1 జూలై (హి.స.)యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చ
ఆక‌ట్టుకుంటున్న 'త‌మ్ముడు' రిలీజ్ ట్రైల‌ర్‌


అమరావతి, 1 జూలై (హి.స.)యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆస‌క్తిక‌రంగా ఉండి, అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ట్రైలర్‌ను చూస్తే, ఈ సినిమా కథ మొత్తం అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బలమైన అనుబంధం చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. తన సోదరి చేత ఆప్యాయంగా 'తమ్ముడు' అని పిలిపించుకోవాలని ఆరాటపడే యువకుడి పాత్రలో నితిన్ కనిపించారు. ఆ ఒక్క పిలుపు కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే పాత్రలో ఆయన నటన ఆకట్టుకునేలా ఉంది.

భావోద్వేగభరితమైన సన్నివేశాలతో పాటు, యాక్షన్ అంశాలు కూడా సినిమాలో ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా 'కాంతార' ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటి లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తూ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande