హైదరాబాద్, 10 జూలై (హి.స.)
భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్‌మెన్‌లదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్ల బ్యాటర్లు భారీగా పరుగులు సాధించగా, పలువురు ఆటగాళ్లు సెంచరీలు, అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఇక రెండు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి.ఈ నేపథ్యంలో, సిరీస్‌లో కీలకమైన మూడో టెస్ట్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇక భారత్ టీమ్ లోకి బూమ్రా తిరిగి వచ్చాడు.. ప్రసిద్ద కు విశ్రాంతి ఇచ్చారు. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 310 పరుగులుగా నమోదవుతోంది. లార్డ్స్ చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడ 344 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్