దిల్లీ: 13 జూలై (హి.స.)యునైటెడ్ కింగ్‌డమ్‌లో జులై 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి రానున్నాయి. ఇమిగ్రేషన్ వ్యవస్థలో చేపట్టిన విస్తృత మార్పుల్లో భాగంగా వీటిని వాడుకలోకి తీసుకొస్తున్నారు. జులై 15 నుంచి జారీ చేసే అన్ని వీసాలు వాటిని పొందేవారి పాస్‌పోర్టులతో లింకై.. డిజిటల్ రూపంలో ఉండనున్నాయి. ఇవి అన్ని రకాల వాటికి వర్తిస్తుంది. యూకేలో విద్యాభ్యాసం చేసే వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువ. ఇమిగ్రేషన్ ప్రాసెస్‌ను గాడినపెట్టేందుకు ఈ సరికొత్త వీసాలను అమల్లోకి తెస్తోంది. విద్యార్థులు కచ్చితంగా తమ డిజిటల్, ప్రొసీజరల్ అంశాలను ప్రయాణానికి ముందే సరిచూసుకోవాల్సి ఉంటుంది.
సరికొత్త విధానం ప్రకారం పాస్‌పోర్టుపై సంప్రదాయ వీసా విగ్నైట్‌ను జారీ చేయరు. దీనికి బదులు ఈ-వీసా జారీ చేస్తారు. ఇది డిజిటల్ ఇమిగ్రేషన్ హోదాను అందిస్తుంది. ఈవీసాల్లో కచ్చితంగా విద్యార్థులు అప్‌డేట్ చేసిన పర్సనల్ పాస్‌పోర్టు వివరాలు ఉండాల్సిందే. పాస్‌పోర్టు రెన్యూవల్‌లో మార్పులను కూడా తెలియజేయాల్సి ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ