అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్‌ కుమార్ కేసు వరకు.. మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి?విజయ్‌
హైదరాబాద్, 13 జూలై (హి.స.)తమిళనాడులో (Tamil Nadu)లో అజిత్‌ కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ మరణం (Custodial Death) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’ పార
అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్‌ కుమార్ కేసు వరకు.. మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి?విజయ్‌


హైదరాబాద్, 13 జూలై (హి.స.)తమిళనాడులో (Tamil Nadu)లో అజిత్‌ కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ మరణం (Custodial Death) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ (Vijay) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విజయ్ నల్ల చొక్కా ధరించి.. ‘సారీ కాదు, మాకు న్యాయం కావాలి’ అని రాసున్న ప్లకార్డును పట్టుకున్నారు. ‘ప్రభుత్వం నుంచి మనకు ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోంది. అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్‌ కుమార్ కేసు వరకు.. మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి?. కోర్టులే జోక్యం చేసుకుని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అలాంటప్పుడు మీ పాలనతో మాకేం అవసరం?. ముఖ్యమంత్రితో అవసరం ఏముంది?. అజిత్‌ కుమార్‌ పేద కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. ఈ ఘటన అనంతరం సీఎం సారీ చెప్పారు. మీ హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారు. వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. అజిత్‌ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలి’ అని విజయ్‌ డిమాండ్‌ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande