చెన్నై , 13 జూలై (హి.స.)-తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలుకి మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలుకు ఆదివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొలుత రైలు పట్టాలు తప్పిన తర్వాత మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ