పెద్దపల్లి జిల్లాలో దారుణం.. పంచాయతీ కోసం పిలిచి కత్తులతో దాడి.. ఇద్దరి మృతి
తెలంగాణ, పెద్దపల్లి. 15 జూలై (హి.స.) భార్యాభర్తల పంచాయతీ కోసం ఇరువర్గాలు సమావేశం కాగా.. అబ్బాయి తరపు వారిపై అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా విరుచుకుపడి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో మం
పెద్దపల్లి జిల్లా


తెలంగాణ, పెద్దపల్లి. 15 జూలై (హి.స.)

భార్యాభర్తల పంచాయతీ కోసం ఇరువర్గాలు సమావేశం కాగా.. అబ్బాయి తరపు వారిపై అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా విరుచుకుపడి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరఫు వారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరుపు వారు పంచాయతీ విషయంలో సుగ్లాంపల్లి గ్రామంలో సమావేశమయ్యారు.భార్యాభర్తల పంచాయతీ విషయంలో చర్చిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అమ్మాయి తరపు వారు కత్తులతో అబ్బాయి తరపు వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మోటం మల్లేష్ (40), గణేష్ మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి..

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande