హైదరాబాద్, 16 జూలై (హి.స.)
ఘట్కేసర్-యాదాద్రి (రాయగిరి) 33 కి.మీ ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించి నిధుల మంజూరు చేశారు. అందుకు గాను కేంద్ర రైల్వే మంత్రికి ఆశ్విని వైభవ్, సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ఏప్రిల్ 3న జీరో అవర్ సందర్భంగా తన ప్రశ్నకు సమాధానమిచ్చినందుకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లు చెల్లించినందుకు, ఈ ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు సమకూర్చినందుకు భువనగిరి ప్రజల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 412 కోట్లు కేంద్రం భరించి పనులు పూర్తి చేస్తామని మొదటి దశలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి లేఖ విడుదల అయినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్