విశ్రాంత ఈఎన్ సీ మురదుదరై కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్
అమరావతి, 16 జూలై (హి.స.) హైదరాబాద్‌: విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావుకు రిమాండ్‌ విధించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించింది. మురళీధర్‌రావును చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో మంగళవారం ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన
విశ్రాంత ఈఎన్ సీ మురదుదరై కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్


అమరావతి, 16 జూలై (హి.స.)

హైదరాబాద్‌: విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావుకు రిమాండ్‌ విధించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించింది. మురళీధర్‌రావును చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో మంగళవారం ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన పేరిట భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు.

మంగళవారం బంజారాహిల్స్‌లోని మురళీధర్‌రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న చర, స్థిరాస్తుల్ని గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande