హైదరాబాద్, 16 జూలై (హి.స.)
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి
వక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ మార్క్ లేమి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనకూల రాష్ట్రం అని భట్టి విక్రమార్క బృందానికి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడి వనరులు, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని కోరారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మరియు అధికారులు భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పలు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. అంతే కాకుండా రాష్ట్రానికి సైతం ఆదాయం పెరుగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..