అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి కేసు.. ఎన్‌ఆర్‌ఐ అరెస్ట్‌
చండీగఢ్‌, 16 జూలై (హి.స.) : ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్‌ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్‌(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్‌ సింగ్ ధిల్లాన్‌ను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు.
అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి కేసు.. ఎన్‌ఆర్‌ఐ అరెస్ట్‌


చండీగఢ్‌, 16 జూలై (హి.స.)

: ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్‌ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్‌(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్‌ సింగ్ ధిల్లాన్‌ను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు బుధవారం వెల్లడించారు.

పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో తన స్వగ్రామమైన బియాస్‌లో సోమవారం సాయంత్రం ఫౌజా సింగ్‌ (Marathoner Fauja Singh) రోడ్డుపై నడుస్తుండగా అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరి ఏడడుగుల దూరంలో పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. దాన్ని ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్‌ ధిల్లాన్‌ నడిపినట్లు గుర్తించి నిన్న అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. జలంధర్‌కు చెందిన అమృత్‌పాల్‌ కుటుంబంతో సహా కెనడాలో నివాసముంటున్నారు. ఇటీవలే స్వదేశానికి వచ్చిన అతడు.. పని మీద భోగ్‌పుర్‌ వెళ్లి తిరిగివస్తుండగా.. ఫౌజా సింగ్‌ను ఢీకొట్టాడు.

తానే ఈ ప్రమాదానికి కారణమని అమృత్‌పాల్ విచారణలో అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిని ఢీకొట్టిన విషయం తెలిసి భయంతో అక్కడినుంచి పారిపోయానని అతడు చెప్పినట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande