హైదరాబాద్, 16 జూలై (హి.స.)
హైదరాబాద్ లోని సున్నం చెరువు వద్ద అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. గ్రామంలోని రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 30లో సున్నం చెరువు 24 ఎకరాల 12 గుంటలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల సరిహద్దులను నిర్దారించకుండా సియెట్ సొసైటీలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సున్నం చెరువు స్థలం ఎంత అనే విషయాన్ని తమకు రిపోర్టు ఇవ్వాలని అధికారులును ఆదేశించింది.
అయితే కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సున్నం చెరువు వద్ద బుధవారం సర్వేను చేపట్టారు. చెరువు సరిహద్దులను కొలతవేస్తున్నారు. రేపు కూడా సర్వే చేయనున్నారు. అనంతరం కోర్టుకు సర్వే రిపోర్టును అందజేయనున్నారు.
కాగా సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కూల్చివేతలపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన ధర్మాసనం అసలు మొత్తం చెరువును సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..