బీసీ రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేయాలి.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 16 జూలై (హి.స.) రాష్ట్రంలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ బంజారాహిల్స్లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్
ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

రాష్ట్రంలో 25 వేల మంది బీసీలు

ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ బంజారాహిల్స్లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆ 25 వేల పదవుల్లో సగం మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచ్లు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీలలో ఉన్నాయని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande