హైదరాబాద్, 16 జూలై (హి.స.)
సాధారణ ఎన్నికల సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై నేరెడుచెర్లతో పాటు మఠంపల్లి పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ కేసులను వెంటనే కొట్టివేయాలని కోరుతూ.. ఇటీవలే ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావుకు కౌంట్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసుల జారీ చేశారు. అదేవిధంగా కేసు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పును వెలువరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్