న్యూఢిల్లీ: 16 జూలై (హి.స.)రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ, అక్కడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తాము 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తామని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) చీఫ్ మార్క్ రుట్టే.. భారత్, చైనా, బ్రెజిల్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. దీనికితోడు శాంతి చర్చలలో పాల్గొనేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనే అమెరికా ఒత్తిడి మేరకు ‘నాటో’ చీఫ్ ఈ ప్రకటన చేశారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, శాంతి చర్చలకు రావాలని కోరారు. మరోవైపు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై 500% వరకు సుంకాల బిల్లును అమెరికా సెనేటర్లు వెనక్కి తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆంక్షలు విధిస్తే, భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.
బ్రెజిల్, చైనా, భారత్‌లు ఇకపై రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు