తెలంగాణ, మంచిర్యాల. 16 జూలై (హి.స.)
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ
రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు శాంపిళ్లను సేకరించారు. ఆ బాటిళ్లకు నిబంధనల ప్రకారం సీల్ వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సీఐ సమ్మయ్య మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైడింగ్స్ జరుగుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు నిర్వహించినట్లు సీఐ సమ్మయ్య తెలిపారు. సేకరించిన తెల్ల కల్లు బాటిళ్లను సీజ్ చేసి నిజామాబాద్లోని కెమికల్ ల్యాబ్స్క తరలించినున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి రానున్న రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు