హైదరాబాద్, 16 జూలై (హి.స.)
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
సాధ్యమవుతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యున్నత స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం పటాన్ చెరు లోని గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టోరూమ్ షోరూమ్ ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్య ద్వారా ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టువచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులకు ప్రాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వారు
ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల విద్యను బోధించడం ద్వారా కార్పొరేట్ పాఠశాలలవిద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..