బాలసోర్16 జూలై (హి.స.)ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఇక భువనేశ్వర్‌లో అసెంబ్లీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగించారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఇక బంద్ కారణంగా బాలసోర్ దగ్గర కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ క్యాంపస్‌లో తనను తాను నిప్పంటించుకుంది. విద్యార్థిని జూలై 14న ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 95 శాతం కాలిన గాయాలతో మరణించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు