హైదరాబాద్, 2 జూలై (హి.స.): కొత్తగా పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) తీసుకోవాలని అనుకుంటున్నారా.. మీకు ఆధార్ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు, ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణలో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోయేది. ఇక నుంచి తప్పనిసరిగా ఆధార్ సంఖ్య ఉండాల్సిందే. ఇప్పటికే పాన్ ఉన్నవారు కచ్చితంగా దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే పాన్ రద్దవుతుంది. చెల్లని పాన్‌తో ఏవైనా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే, జరిమానా విధిస్తారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ