అమర్‌నాథ్‌ యాత్ర షురూ.. మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటన
శ్రీనగర్, 2 జూలై (హి.స.) భక్తులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది…! అత్యంత ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్ర షురూ అయ్యింది. పహల్గమ్ ఉగ్రదాది నేపధ్యంలో మునుపెన్నడు లేని భారీ భద్రత నడుమ అమర్‌నాథ్‌కు కదిలారు భక్తజనం. హరహర మహదేవ నినాదాలతో
అమర్‌నాథ్‌ యాత్ర షురూ.. మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటన


శ్రీనగర్, 2 జూలై (హి.స.)

భక్తులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది…! అత్యంత ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్ర షురూ అయ్యింది. పహల్గమ్ ఉగ్రదాది నేపధ్యంలో మునుపెన్నడు లేని భారీ భద్రత నడుమ అమర్‌నాథ్‌కు కదిలారు భక్తజనం. హరహర మహదేవ నినాదాలతో కష్టాన్ని మరిచి ముక్కంటి సన్నిధికి చేరుకుంటున్నారు.

ఈ రోజుతో మొదలైన అమర్‌నాథ్‌ యాత్ర అగస్టు 9 రక్షాబంధన్‌తో ముగస్తుంది. అంటే సుమారు నలభై రోజులపాటు సాగనున్న ఈ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్భందీగా ఏర్పాట్లు చేశాయి. పహల్గామ్‌ దాడి తర్వాత జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర జరుగుతుండటంతో అడుగడుగునా నిఘా పెంచారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఇప్పటికే పలుసార్లు సెక్యూరిటీపై సమీక్షలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పహల్గామ్‌, బాల్తాల్‌లోనైతే చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీని ఫుల్ టైట్‌ చేశారు.

ఈసారి అమర్‌నాథ్‌ యాత్రికులకు RFID ట్యాగ్‌లు ఇచ్చారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటు ఆర్మీతో పాటు బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో సెక్యూరిటీని పటిష్టం చేశారు. అలాగే యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ఇప్పటికే ప్రకటించారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఈసారి హెలికాప్టర్‌ సర్వీసులను నిలిపివేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande