డిల్లీ, 2 జూలై (హి.స.)హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.
60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేయడానికి ఇజ్రాయెల్ షరతులకు అంగీకరించిందని,‘‘ఈ సమయంలో మేము యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తాము’’ అని ట్రంప్ అన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్‌కు “ఈ తుది ప్రతిపాదన”ను అందజేస్తారని ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల కోసం హమాస్ ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఒక వేళ హమాస్ అంగీకరించకుంటే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ