జీఎస్టీతో ఆర్థిక అన్యాయం: రాహుల్‌
దిల్లీ, 2 జూలై (హి.స.)దిల్లీ: ఎనిమిదేళ్లు పూర్తిచేసుకొన్న జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌) పన్ను విధానం ఆర్థిక అన్యాయాన్ని, కార్పొరేట్‌ ఆశ్రిత పక్షపాతాన్ని పెంచి పోషిస్తున్న క్రూరమైన సాధనమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ
Modi and Rahul Gandhi


దిల్లీ, 2 జూలై (హి.స.)దిల్లీ: ఎనిమిదేళ్లు పూర్తిచేసుకొన్న జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌) పన్ను విధానం ఆర్థిక అన్యాయాన్ని, కార్పొరేట్‌ ఆశ్రిత పక్షపాతాన్ని పెంచి పోషిస్తున్న క్రూరమైన సాధనమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రజలకు తొలి ప్రాధాన్యమిస్తూ వ్యాపారులకు స్నేహపూర్వకంగా, సిసలైన సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాలంటూ మంగళవారం ‘ఎక్స్‌’ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘చిన్న దుకాణదారు నుంచి రైతు వరకు ప్రతి భారతీయుడు దేశ పురోగతిలో భాగస్వామిగా ఉండేలా భారత్‌కు సార్వజనీక పన్ను విధానం అవసరం. మోదీ సర్కారు గత ఎనిమిదేళ్లుగా అమలుచేస్తున్న జీఎస్టీ పేదలను శిక్షించడానికి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) మూసివేతకు, రాష్ట్రాలను అణగదొక్కి.. ప్రధానికి ఉన్న కొద్దిమంది బిలియనీర్‌ మిత్రులు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతోంది’’ అని రాహుల్‌ మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande