మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. జులై2 బుధవారం ధరలు ఇవే..
ముంబై, 2 జూలై (హి.స.)జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 దాకా పడిపోవడం చూసిన పసిడి ప్రియులు సంతోషపడ్డారు. హమ్మయ్య ఎట్టకేలకు బంగారం ధరలు శాంతించ
Gold


ముంబై, 2 జూలై (హి.స.)జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 దాకా పడిపోవడం చూసిన పసిడి ప్రియులు సంతోషపడ్డారు. హమ్మయ్య ఎట్టకేలకు బంగారం ధరలు శాంతించాయని భావించారు. కానీ, జూన్ 23 నుంచి 30 వరకు అంటే కేవలం వారం రోజుల పాటు గోల్డ్‌ రేట్‌ దిగుతూ వచ్చింది. పసిడి ధరలో ఈ భారీ తగ్గింపు జులై ఆరంభంలోనే అమాంతంగా పెరిగింది. జులై 1న పది గ్రాముల బంగారం పై ఏకంగా రూ.1,140 మేర ధర పెరిగింది. ఆ మర్నాడు జులై 1న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి. భారతదేశంలో ఈరోజు జులై 2న 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,841, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,021లు కాగా, 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.7,381లుగా ఉంది.

* ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,560, 22 క్యారెట్ల ధర రూ.90,360 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,100 లుగా ఉంది.

* ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,410, 22 క్యారెట్ల ధర రూ.90,210 ఉంది. వెండి ధర కిలో రూ.1,10,100 గా ఉంది.

* చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,410 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,100 లుగా ఉంది.

* బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,410, 22 క్యారెట్ల ధర రూ.90,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,100 లుగా ఉంది.

* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,410 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,210 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,100 గా ఉంది.

* విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,410, 22 క్యారెట్ల ధర రూ.90,210లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,20,100 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande