ఈ గింజలు రోజూ పిడికెడు తినండి చాలు..ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..
కర్నూలు, 2 జూలై (హి.స.)అన్ని కూరగాయల మాదిరిగానే గుమ్మడికాయను కూడా చాలా మంది వంటల్లో వాడుతుంటారు. గుమ్మడికాయతో కర్రీ, సాంబార్, వడియలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే, కొందరు ఉదయాన్నే గుమ్మడి కాయ జ్యూస్‌ చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అయితే.. గుమ్మడికాయ
గింజలు రోజూ పిడికెడు తినండి చాలు..ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..

కర్నూలు, 2 జూలై (హి.స.)అన్ని కూరగాయల మాదిరిగానే గుమ్మడికాయను కూడా చాలా మంది వంటల్లో వాడుతుంటారు. గుమ్మడికాయతో కర్రీ, సాంబార్, వడియలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే, కొందరు ఉదయాన్నే గుమ్మడి కాయ జ్యూస్‌ చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అయితే.. గుమ్మడికాయతోనే కాకుండా.. గుమ్మడి గింజల వల్ల కూడా హెల్త్​ బెనిఫిట్స్ ఎక్కుగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్యఔషధంలా పని చేస్తాయని చెబుతున్నారు.. గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గుమ్మడి గింజలు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్​, క్యాల్షియం, ఐరన్​, ప్రొటీన్​, పొటాషియం, పాస్పరస్​, విటమిన్​ ఎ, బి, సి, డి, బి12 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు పదార్థం గుండెకు రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చూస్తుంది.

గుమ్మడి గింజలు రోజూ తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడే బ్లడ్‌ ప్రెజర్‌ కూడా అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడే బ్లడ్‌ ప్రెజర్‌ కూడా అదుపులో ఉంటాయి. నిద్ర క్వాలిటీ కూడా పెరుగుతుంది. గుమ్మడి గింజలు ఇమ్యూనిటీ కూడా బూస్ట్‌ చేస్తుంది.

గుమ్మడి గింజలు జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే.. జింక్‌ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.

గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే.. గ్యాస్ట్రిక్‌, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది. గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి

 rajesh pande