ఢిల్లీ, 2 జూలై (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనకు బయలుదేరనున్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ చేస్తున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలోని ప్రధాన ఉద్దేశ్యం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ప్రధాని మోడీ దృష్టి సారించనున్నారు. అలాగే, ప్రధానమంత్రి బ్రెజిల్‌లో జరిగే కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలోనూ పాల్గొంటారు.
ప్రధాని మోదీ చివరి ఎనిమిది రోజుల పర్యటన జులై 2015లో ఆరు దేశాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోడీ రష్యాతోపాటు ఐదు మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. ఈ పర్యటన రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక చర్యలపై సహకారం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి