మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు
ముంబై, 2 జూలై (హి.స.)దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు నెలకొనడంతో.. మన సూచీలు స్తబ్దుగా కదలాడుతున్నాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 87 పాయింట్ల లాభంతో 83,790 వద్ద ట్రేడవుతోంది. నిఫ
అమరావతి:


ముంబై, 2 జూలై (హి.స.)దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు నెలకొనడంతో.. మన సూచీలు స్తబ్దుగా కదలాడుతున్నాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 87 పాయింట్ల లాభంతో 83,790 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 25,562 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.62గా ఉంది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, శ్రీరామ్ ఫైనాన్స్‌, అపోలో హాస్పిటల్స్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాక్స్ నష్టాల్లో మొదలయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande