డిల్లీ, 2 జూలై (హి.స.)భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు దగ్గరపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్-యూఎస్ త్వరలో ‘‘చాలా తక్కువ సుంకాలతో’’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. దీని వల్ల రెండు దేశాలు పోటీ పడుతాయని చెప్పారు. ‘‘భారతదేశంతో మనం ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని నేను అనుకుంటున్నాను. అది వేరే రకమైన ఒప్పందం అవుతుంది. మనం భారత్ లోపలికి వెళ్లి పోటీ పడగలిగే ఒప్పందం ఇది అవుతుంది. ప్రస్తుతం, భారతదేశం ఎవరినీ అంగీకరించదు. భారతదేశం అలా చేయబోతోందని నేను భావిస్తున్నాను, వారు అలా చేస్తే, చాలా తక్కువ సుంకాలకు ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము’’ అని ట్రంప్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ