న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుంది. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తొలగించిన పేర్లలో చనిపోయినట్లు నివేదించబడిన 18 లక్షల మంది ఓటర్లు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన 26 లక్షల మంది, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న 7 లక్షల మంది ఉన్నారని కమిషన్ తెలిపింది.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు ప్రజలు అభ్యంతరాలు తెలుపవచ్చని ఈసీ చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ