న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.)ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 26 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్లడం విశేషం.
23, 24 తేదీల్లో మోడీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించనున్నారు. భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా భారతదేశానికి విస్కీ, కార్ల వంటి బ్రిటిష్ ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఇదిలా ఉంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ