న్యూఢిల్లీ, 23 జూలై (హి.స.) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. జస్టిస్ వర్మ తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) వెల్లడించారు. విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు.
ఈ విషయం పలు రాజ్యాంగ సమస్యలను లేవనెత్తుతుండడం వల్ల తమ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించాలని జస్టిస్ వర్మ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందిస్తూ.. విచారణ కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నందున ఈ కేసును విచారించబోనని సీజేఐ స్పష్టం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ