బెంగళూరు, 23 జూలై (హి.స.)కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం- ధర్మస్థలలో పలు అనుమానాస్పద హత్యలు, అత్యాచారాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై శ్రీక్షేత్రం ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే సోదరుడు హర్షేంద్రకుమార్‌పై ఎటువంటి కథనాలనూ ప్రసారం చేయవద్దని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ‘థర్డ్ ఐ యూట్యూబ్ ఛానెల్’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కొందరు బాధితుల కుటుంబసభ్యులు చెబుతున్న పేర్లను ప్రసారం చేయవద్దని నిర్బంధించేందుకు పుష్కరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ‘థర్డ్ ఐ’ ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. ప్రతిసారీ తమ హోదాను, ఆలయ ప్రతిష్ఠను అడ్డుపెట్టుకుని కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ