పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అమరావతి, 25 జూలై (హి.స.) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారతదేశంలో బంగారం, వెండి ధరలు (Gold Silver Rates Today on July 25th 2025) భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జులై 25, 2025న ఉదయం 6:10 గంటల సమయానికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము
GOLD


అమరావతి, 25 జూలై (హి.స.)

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారతదేశంలో బంగారం, వెండి ధరలు (Gold Silver Rates Today on July 25th 2025) భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జులై 25, 2025న ఉదయం 6:10 గంటల సమయానికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,380 తగ్గి రూ.1,00,960 స్థాయికి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,540కి పడిపోయింది. అదే సమయంలో, వెండి ధర కిలోకు రూ.2,000 తగ్గి రూ.1,17,100కి చేరుకుంది. ఈ ధరల పతనం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కూడా కనిపిస్తోంది.

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి కిలోకు రూ.1,27,900.

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ.1,01,110, 22 క్యారెట్ల బంగారం రూ.92,690, వెండి కిలోకు రూ.1,17,900.

ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,490, వెండి కిలోకు రూ.1,17,900.

చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి కిలోకు రూ.1,27,900.

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి కిలోకు రూ.1,17,900.

ఈ ధరలు నగరాల మధ్య స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి మారుతుంటాయి.

ధరల తగ్గుదలకు కారణాలు

బంగారం, వెండి ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. గ్లోబల్ ఎకానమీలో అనిశ్చితి, అమెరికన్ డాలర్ బలపడటం, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలపడినప్పుడు, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఎందుకంటే బంగారం ధర డాలర్‌లో లెక్కించబడుతుంది.

వెండి రేట్లు ఎందుకు..

వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వల్ల ప్రభావితమయ్యాయి. వెండి ఎక్కువగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి, గ్లోబల్ ఉత్పాదన క్షీణించడం దాని ధరను తగ్గించింది. భారతదేశంలో స్థానిక మార్కెట్‌లో డిమాండ్ కూడా కొంతవరకు తగ్గడం వల్ల ధరలు పడిపోయాయి. ఇటీవల బంగారం ధరలు లక్ష రూపాయలను దాటడంతో, కొనుగోళ్లు తగ్గాయని, ఇది ధరల సవరణకు దారితీసిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande